హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రివర్గంలో తెలంగాణ వాటా రావాలి: ఎమ్మెల్యే గండ్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandra Venkata Ramana Reddy
హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ ప్రాంతానికి చెందాల్సిన వాటా రావాల్సిందేనని వరంగల్ జిల్లా శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణా రెడ్డి మంగళవారం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతం నుండి ఇద్దరు మంత్రులు రాజీనామా చేసినందున ఆ ఖాళీలను తెలంగాణ నేతల నుండి భర్తీ చేస్తేనే సమతుల్యత ఉంటుందన్నారు. మంత్రివర్గ విస్తరణ గురించి తాను మీడియా కథనాలు చూస్తున్నానని చెప్పారు. అధిష్టానం అనుమతితోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విస్తరణ చేపడతారన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సిఎం మధ్య విభేదాలు వదంతులేనన్నారు. పార్టీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు సహజమేనని అన్నీ సర్దుకుంటాయన్నారు. ప్రజారాజ్యం పార్టీలో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని చాలా రోజుల నుండి వినిపిస్తోందని అయితే వారితో పాటు ఇతర ఖాళీలు కూడా భర్తీ చేస్తే బావుంటుందన్నారు. ఆయన అంతకుముందు ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు.

కాగా మంత్రి పదవులు ముఖ్యం కాదని తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలు పోరాటం చేయాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ కరీంనగర్ జిల్లాలో మాట్లాడుతూ సూచించారు. ఎన్టీపిసి విస్తరణలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీపిసి విద్యుత్ ఇదే ప్రాంతానికి వాడాలన్నారు.

English summary
MLA Gandra Venkata Ramana Reddy responded about cabinet reshuffle today after met CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X