నేపాల్ టూర్ వెళ్లొద్దామా.. తక్కువ ధరకే IRCTC సూపర్ ఆఫర్..!
ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మికతకు, సాహస క్రీడలకు నేపాల్ ప్రసిద్ధి.. నేపాల్ టూర్ కు వెళ్లాలని చాలామంది ప్రకృతి ప్రేమికులు, టూరిస్టులు ఆసక్తి చూపిస్తుంటారు. నేపాల్ పర్వతాల నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలను వీక్షిస్తే వచ్చే కిక్కు మామూలుగా ఉండదు. ప్రపంచ దేశాల నుంచి నేపాల్ కు నిత్యం వేలాదిమంది టూరిస్టులు వస్తుంటారు. నేపాల్ లో చూడదగిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ నేపాల్ లోనే ఉంది. దీని ఎత్తు 8,848.86 మీటర్లు. స్థానికులు దీనిని సాగర్ మాతా అని పిలుస్తుంటారు. అలాగే నేపాల్ లో పశుపతినాథ్ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది.
పశుపతినాథ్ దేవాలయం.. ఖాట్మండులో ఉన్న ఈ పురాతన శివాలయం హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. అలాగే లుంబిని ప్రాంతం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఇది. బౌద్దులకు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా నిలుస్తోంది. ఇక బౌద్ధనాథ్ స్తూపం.. ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ద స్తూపాలలో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక భారతీయులు నేపాల్ వెళ్లడానికి ఎలాంటి వీసా అవసరం లేదు.
అయితే నేపాల్ లో పర్యటించాలనుకునేవారికి ఐఆర్సీటీసీ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ 7 రోజులు ఉంటుంది. ఈ టూర్ లో భాగంగా వరల్డ్ పీస్ పగోడా, మాయాదేవి ఆలయం, సారంగ్ కోట్ వ్యూ పాయింట్, డెవిల్స్ ఫాల్, గుప్తేశ్వర్ మహదేవ్ గుహ, స్వయంభునాథ్ టెంపుల్, రాయల్ ప్యాలెస్, జానకీ ఆలయం దర్శించుకుంటారు.

హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా కాఠ్ మండూ, పోఖరా, లుంబిని, జనక్ పుర్ వంటి పర్యాటక ప్రాంతాలను కవర్ చేయవచ్చు. అయితే నేపాల్ టూర్ వెళ్లాలనుకునేవారికి తప్పనిసరిగా పాస్ పోర్ట్ కలిగి ఉండాలి. ఇక ప్రస్తుతం ఈ టూర్ జూన్ 25, 2026వ తేదీన అందుబాటులో ఉంది. నేపాల్ టూర్ కోసం సింగిల్ షేరింగ్ కు రూ. 75 వేలుగా ఉంది. అలాగే డబుల్ షేరింగ్ కు రూ. 62,900 గా ఉంది. ఇక త్రిబుల్ షేరింగ్ కు రూ. 58 వేలుగా ఉంది.












Click it and Unblock the Notifications