మల్లూ బ్యూటీ "కళ్యాణి ప్రియదర్శిని" వీడియో వైరల్ !!
కళ్యాణి ప్రియదర్శన్.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, అలనాటి నటి లిజీ దంపతుల ముద్దుల కుమార్తె. స్టార్ కిడ్ అనే ముద్రకే పరిమితం కాకుండా తన నటనతోనే ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'హలో' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. నటిగా మాత్రం ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన "చిత్రలహరి" మూవీలో నటించి మెప్పించింది.
ఆ తర్వాత మలయాళ చిత్రసీమపై ఎక్కువ దృష్టి పెట్టిన ఆమె.. ఇటీవల విడుదలైన ' లోక చాప్టర్ 1 : చంద్ర' సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా.. లేడీ సూపర్ హీరోయిన్ తరహా పాత్రలో అలరించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. కళ్యాణి కెరీర్‌లోనే కాకుండా మలయాళ చిత్ర పరిశ్రమలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పొందింది.

కాగా ప్రస్తుతం ఈమె బికినీ ధరించినట్లు ఉన్న ఒక వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కానీ కళ్యాణి కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏ సినిమాలోనూ, కనీసం ఫోటోషూట్స్‌లో కూడా గ్లామర్ షో లేదా స్కిన్ షో చేసింది లేదు. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ సడెన్‌గా ఈ రేంజ్ బోల్డ్ అవతారంలో కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. దాంతో ఇప్పటికే రష్మిక మందన్న, ఆలియా భట్, కత్రీనా కైఫ్, రుక్మిణీ వసంత్ వంటి ఎంతోమంది హీరోయిన్లు ఫేక్ వీడియోల బారిన పడగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి హోమ్లీ బ్యూటీ కూడా చేరారని చెబుతున్నారు.
అయితే ఇలాంటి నకిలీ కంటెంట్‌ను సృష్టించడం, వైరల్ చేయడం బాధ్యతారాహిత్యమని, తీవ్రమైన ప్రైవసీ ఉల్లంఘన అని తెలిసిందే. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. ఫేక్ కంటెంట్‌ను ఎవరూ పోస్టు చేయొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
— Sowmee ✨ (@iSawmiyaa) May 24, 2026












Click it and Unblock the Notifications