బంగారానికి ఎందుకు తుప్పు పట్టదు? శతాబ్దాల నాటి మిస్టరీ..

ప్రకృతిలో ఏ వస్తువైనా గాలి, వెలుతురు తగిలితే కాలక్రమేణా పాడైపోతుంది. కానీ బంగారం మాత్రం ప్రకృతి శక్తులకు అతీతంగా కనిపిస్తుంది. దీనికి గల కారణాన్ని అమెరికాలోని తులనే విశ్వవిద్యాలయానికి చెందిన రసాయన ఇంజనీర్ మాథ్యూ మోంటెమోర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం లోతుగా పరిశోధించి వెల్లడించింది. బంగారం పైభాగంపై ఉండే అణువుల ప్రత్యేక అమరిక వల్లే అది ఆక్సిజన్‌తో చర్య జరపకుండా, తుప్పు పట్టకుండా ఉంటుందని వారు కనుగొన్నారు. ఈ పరిశోధన వివరాలు ప్రసిద్ధ సైన్స్ జర్నల్ "ఫిజికల్ రివ్యూ లెటర్స్" లో ప్రచురితమయ్యాయి.

అణువుల 'మాయాజాలం'..

సాధారణంగా ఏదైనా ఒక లోహం తుప్పు పట్టాలంటే (ఆక్సీకరణం చెందాలంటే), మొదట దాని చుట్టూ ఉన్న గాలిలోని ఆక్సిజన్ అణువులు విడిపోయి, లోహం ఉపరితలానికి అంటుకోవాలి. బంగారం విషయంలో ఒక వింత జరుగుతుంది. బంగారాన్ని కత్తిరించినప్పుడు లేదా ఒక కొత్త ఉపరితలం బయటపడినప్పుడు, దానిలోని అణువులు తమ అసలు చతురస్రాకార లాటిస్ అమరిక నుండి త్వరగా మారిపోయి ఒక "షడ్భుజి" (Hexagon) ఆకృతిలోకి పునర్నిర్మితమవుతాయి.

Scientists Discover Why Gold Never Corrodes Thanks To Atomic Level Structural Metamorphosis Resistance
పసిడి వ్యామోహానికి బ్రేక్ వేయగలమా? ఫెయిలైన గోల్డ్ స్కీమ్..?
పసిడి వ్యామోహానికి బ్రేక్ వేయగలమా? ఫెయిలైన గోల్డ్ స్కీమ్..?

శాస్త్రవేత్తల క్వాంటం మెకానికల్ లెక్కల ప్రకారం.. చతురస్రాకార అమరికతో పోలిస్తే, ఈ షడ్భుజి ఆకృతి ఆక్సిజన్‌ను అసలు విడవనివ్వదు. గాలిలోని ఆక్సిజన్ బంగారాన్ని తాకి లోపలికి వెళ్లాలంటే, ఈ షడ్భుజి ఆకారం మళ్లీ పాత చతురస్రాకారంలోకి మారాల్సి ఉంటుంది. ఇది జరగడం చాలా కష్టం. ఈ అద్భుతమైన అణువుల రక్షణ గోడ వల్లే బంగారం ఆక్సీకరణ ప్రక్రియను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఒకవేళ బంగారం అణువుల్లో ఈ మార్పు గనుక జరగకపోతే, పసిడి కూడా కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే తుప్పు పట్టడం ప్రారంభమవుతుందని పరిశోధకులు తేల్చి చెప్పారు.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు, వెండి కొనాలన్నా భయమే
మళ్లీ పెరిగిన బంగారం ధరలు, వెండి కొనాలన్నా భయమే

బిలియన్ రెట్లు నెమ్మదిగా..

ఈ పరిశోధనలో తేలిన విషయాలు చూసి తామే ఆశ్చర్యపోయామని శాస్త్రవేత్త మాథ్యూ మోంటెమోర్ తెలిపారు. "బంగారం ఉపరితలంపై అణువులు తమ స్థానాన్ని మార్చుకున్న తర్వాత, ఆక్సీకరణ ప్రక్రియ సాధారణం కంటే ఒక బిలియన్ నుండి ట్రిలియన్ రెట్లు నెమ్మదిగా జరుగుతుంది" అని ఆయన వివరించారు. దీనివల్ల ఒకవేళ ఏదైనా కెమికల్ ప్రభావం వల్ల చాలా స్వల్పంగా ఆక్సైడ్ పొర ఏర్పడినా, అది అస్థిరంగా ఉండి వెంటనే తొలగిపోతుంది తప్ప లోపలికి తుప్పు పట్టనివ్వదు. ఈ సరికొత్త ఆవిష్కరణ భవిష్యత్తులో రసాయన శాస్త్రంలో సరికొత్త ఉత్ప్రేరకాలను (కెమికల్ రియాక్షన్ పెంచే పదార్థాలు) తయారు చేయడానికి ఎంతో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+