హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు, జగన్ మద్దతు తెలంగాణకు పలికితేనే: కిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు తెలంగాణకు మద్దతు తెలిపితేనే వారిని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి మంగళవారం ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణకు మద్దతిచ్చిన వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. జై తెలంగాణ జై ఆంధ్రనే మా నినాదం అన్నారు. ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును పెట్టాలనే డిమాండ్‌తో తెలంగాణ పోరు యాత్రకు బిజెపి శ్రీకారం చూట్టిందన్నారు. ఈ నెల 19 నుంచి 24 రోజుల పాటు హైదరాబాద్ మినహా తెలంగాణ జిల్లాల్లో పర్యటన ఉంటుందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమవుతుందని చెప్పారు.

ఏళ్ల తరబడి విముక్తి కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రాంత ప్రజలకు రాష్ట్రం వస్తుందన్న భరోసా, విశ్వాసం కల్పించేందుకే యాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు సిద్ధాంతాలను పక్కన పెట్టి అన్ని ప్రజా సంఘాలు, పార్టీలతో కలిసి పని చేస్తున్నామన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై తెలంగాణ ప్రాంతాన్ని దిగ్బంధం చేసిందన్నారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళతామన్నారు.

English summary
BJP state president Kishan Reddy said that NDA invites parties those are support Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X