తెలంగాణను అడ్డుకుంటుంది చంద్రబాబే: కిషన్ రెడ్డి

Kishan Reddy
మహబూబ్ నగర్: తెలంగాణను అడ్డుకుంటున్నది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురువారం అన్నారు. తెలంగాణ సాధన కోసం బిజెపి తెలంగాణ పోరు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోని మాగనూరు మండలం కృష్ణ గ్రామంలో యాత్రను బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల పాలన వల్లనే జిల్లాలో వలసలు పెరిగాయని ఆరోపించారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. జై ఆంధ్ర ఉద్యమం కూడా బిజెపి చేపట్టిందన్నారు. టిడిపి, కాంగ్రెసు పార్టీలో బిజెపిని అడ్డుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. యాత్రను అడ్డుకునే కుట్ర సరికాదన్నారు. తెలంగాణ సాధన లక్ష్యంలో భాగంగానే యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై వెంటనే కేసులు ఎత్తి వేయాలని నితిన్ గడ్కరీ డిమాండ్ చేశారు. తెలంగాణ పేరుతో కాంగ్రెసు పార్టీ ప్రజలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెసు వైఖరితోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెసు నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. బిజెపితోనే తెలంగాణ సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+