వైయస్ జగన్ వైపు చూస్తున్న గాదె వెంకటరెడ్డి?

కాంగ్రెసు పరిస్థితిని చూస్తే తనకు బాధేస్తోందని ఆయన అన్నారు. అయినా తాను కాంగ్రెసు పార్టీని వీడిపోయేది లేదని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోనని ఆయన చెప్పారు. తాను ఏ కులానికి వ్యతిరేకం కాదని, ఏ కులాన్నీ తాను ద్వేషించడం లేదని ఆయన అన్నారు. కులాల పేరుతో రాజకీయం చేయడం తప్పు అని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడంపై గాదె వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను ఇప్పుడు పార్టీని వీడి బయటకు వెళ్లే స్థితి లేదని, వెళ్లాల్సి వస్తే కారణాలు చెప్తానని, ఆ కారణాలను ప్రతి కాంగ్రెసు నాయకుడు అంగీకరిస్తాడని ఆయన అన్నారు. తాను అంత తొందరగా పార్టీని వీడే వ్యక్తిని కానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications