కుమ్ములాటలపై ఆజాద్ సీరియస్: నేతలకు క్లాస్

Ghulam Nabi Azad
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకుల కుమ్ములాటలపై పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సీరియస్ అయ్యారు. తీరు మారకపోతే మరో తమిళనాడులా రాష్ట్ర కాంగ్రెస్ తయారవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం అవసరమంటూ క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా సీఎం, పీసీసీ అధ్యక్షుడు పరస్పరం గౌరవించుకోవాలని ఆయన సూచించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పార్టీ పరిస్థితిపైనే దృష్టి సారించారు.

పార్టీలో అసంతృప్తులు పెరుగుతున్నాయనిస నేతల మధ్య సయోధ్య లేదని, పరస్పర గౌరవ భావాలు కనిపించడం లేదని, ఇలాగైతే పార్టీ నష్టపోతుందని ఆయన అన్నారు. సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, చిరంజీవి, ఎంపీ కావూరి సాంబశివరావు, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనూ అసంతృప్తులు వ్యక్తమైనప్పటికీ ఈ నెల 5వ తేదీన వ్యక్తమైన స్థాయిలో లేవని సమాచారం. స్థానిక సంస్థల, సహకార, ఉప ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించేందుకు వీలుగా శ్రేణులను సిద్ధం చేయాలని ఆజాద్ ఆదేశించారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతి నివేదికను సమావేశం ముందు ముఖ్యమంత్రి ఉంచారు.

పథకాల విషయంలో తమకు పూర్తి సమాచారం ఉండటం లేదన్న అసంతృప్తి ఇతర సభ్యుల నుంచి మరోసారి వ్యక్తమైంది. కాగా.. రాజీవ్ యువకిరణాల ప్రస్తావన వచ్చినప్పుడు దీనిపై కూడా కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ, ఇంధన శాఖల పనితీరు పట్ల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చిరంజీవి జోక్యం చేసుకుంటూ.. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు సంబంధించి విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టాల్సి ఉందన్నారు. ఈ పథకాల గురించి చాలా మందికి అవగాహనలేదన్న అభిప్రాయం భేటీలో వ్యక్తమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+