వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల జోలికి వద్దు: సింహా డైలాగ్‌తో బాలకృష్ణ హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
విశాఖపట్నం: హీరో నందమూరి బాలకృష్ణ విశాఖపట్నంలో హల్ చల్ చేశారు. ఆదివారం విశాఖమన్యంలో పర్యటించిన బాలకృష్ణ పాడేరులో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలతో పాటు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, స్థానిక సమస్య బాక్సైట్ తవ్వకాలపై స్పందించారు. చంద్రబాబు నాయకత్వంలో టిడిపిని అధికారంలోకి తీసుకు వద్దామని సూచించారు. గిరిజనుల అభివృద్ధి కోసం టిడిపి కృషి చేసిందన్నారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులు సంస్కృతి, సంప్రదాయాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాక్సైట్ తవ్వకాలు జరిపితే గిరిజనులు ఉనికినే కోల్పోవాల్సి వస్తుందన్నారు. మా ప్రభుత్వం వస్తే గిరిజనుల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పారు. ఎన్ఎండిసి రద్దు చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్నారు.

మద్యం సిండికేట్లతో సామాన్యులు చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో లేనట్లుగా తెలుగుదేశం పార్టీలో చిత్తశుద్ధితో పని చేసే కార్యకర్తలు ఉన్నారన్నారు. పార్టీలో కార్యకర్తలు, అభిమానులకు సమ న్యాయం చేస్తామన్నారు. నాన్నగారి అభిమానులే కార్యకర్తలయ్యారని, తన అభిమానులు సైతం అలాగే కావాలన్నారు. టిడిపిని అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నారు. సమస్యలపై మన్యం వీరుడు అల్లూరిలా పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బాలయ్య సింహా సినిమాలోని ప్రజల జోలికి మాత్రం రావద్దూ అనే డైలాగ్‌తో అలరించారు. అందుకు అభిమానులు, కార్యకర్తలు అంతే ఉత్సాహంగా నినాదాలు చేశారు. అనంతరం మినుములూరులో బాలయ్య గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

English summary
Balakrishna created hulchul with Simha cinema dialogue in his Vishakapatnam tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X