బాలకృష్ణ నవ్వి ఊరుకుంటాడు:కేంద్రమంత్రి పురంధేశ్వరి

Purandeshwari
హైదరాబాద్: తన ఇంటి ముందు తొడగొట్టడంపై తన తమ్ముడు, హీరో బాలకృష్ణ మధ్య సరదాగా చర్చకు వచ్చినప్పుడు నవ్వి ఊరుకుంటాడని కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఆదివారం ఓ టీవి ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 2009 ఎన్నికల సమయంలో బాలయ్య టిడిపి తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన కారంచేడులోని పురంధేశ్వరి ఇంటి ముందు తొడగొట్టారు. దీనిపై ప్రశ్నించినప్పుడు పురంధేశ్వరి స్పందిస్తూ దానిని తాను ఎప్పుడూ ఆలోచించలేదని, అయితే సరదాగా తాను ఓసారి అడిగినప్పుడు తన తమ్ముడు నవ్వి ఊరుకున్నాడని చెప్పారు. తనకు కాంగ్రెసు పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు మంచి సపోర్ట్‌ను ఇస్తున్నారని చెప్పారు. విశాఖపట్నంలో తాను ఓడిపోతారని కొందరు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ సోనియా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తనకే మద్దతు ఇచ్చారన్నారు.

ఆమె తన పేరును స్పష్టంగా పలుకుతారని చెప్పారు. విశాఖలో తనను ఎవరు ఓడించారో రిపోర్ట్‌ల ద్వారా తెలుస్తుందన్నారు. అసంతృప్తుల నుండి జాగ్రత్త పడేందుకు ఎన్నికలో చాలా దూరంలో ఉన్నాయన్నారు. అప్పటి వరకు చూద్దామని చెప్పారు. తన తండ్రి, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చివరి క్షణాల్లో పడిన ఆవేదన, తన తల్లి మృతి తనను తీవ్రంగా బాధించే విషయాలు అన్నారు. తన తండ్రి, తల్లి, పిల్లలతో గడిపిన క్షణాలు తనకు అత్యంత సంతోషకరమైన సందర్భాలు అని చెప్పారు. 1995 నాటి సంక్షోభం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+