అప్పటి కన్నా బెటర్: కిరణ్ సర్కారుపై బొత్స ప్రశంసలు

Botsa satyanarayana
హైదరాబాద్: నాడు 2009లో ఉన్న ప్రభుత్వం కన్నా ప్రస్తుతం సంక్షేమ పథకాల కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం అన్నారు. అవసరమైతే ఈ అంశంపై శ్వేత పత్రం విడదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ భేటీ రెండో సమావేశం గాంధీభవన్‌లో శనివారం జరిగింది. పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహ, బొత్స, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ఎంపీ కావూరి సాంబశివ రావు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస రావు, షబ్బీర్ అలీ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశ వివరాలను బొత్స విలేకర్లకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నా ప్రతిపక్షాలు అనవసరంగా బురద జల్లుతున్నాయన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై బొత్స విరుచుకు పడ్డారు.

జగన్, చంద్రబాబు అబద్ధాలకు పేటెంట్లు పొందారన్నారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు రైతుయాత్ర పేరుతో అబద్ధాలు చెబుతున్నారని బొత్స విమర్శించారు. 2009 తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని జగన్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల వారికి కూడా సంక్షేమ పథకాలను చేర్చడానికి కృషి చేస్తున్నామని వివరించారు. వైఎస్ ప్రభుత్వం కన్నా ప్రస్తుత ప్రభుత్వమే సంక్షేమ పథకాలకు అధికంగా ఖర్చు పెడుతోందని బొత్స చెప్పారు. అవసరమైతే జగన్ వచ్చి పరిశీలించుకోవచ్చని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఆరు కిలోల బియ్యం, తొమ్మిది గంటల కరెంటు మినహా మిగతా పథకాలన్నీ వందశాతం అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిగురించి మాట్లాడకుండా పిల్లలకు ఫీజులివ్వలేదని, రైతులను పట్టించుకోలేదని బురద జల్లడం మానుకోవాలని బాబు, జగన్‌కు సత్తిబాబు హితవు పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+