వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై తేల్చండి: ఆజాద్‌తో టి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

lam Nabi Azad
హైదరాబాద్: తెలంగాణ అంశం వీలైనంత త్వరగా తేల్చాలని ఆ ప్రాంత శాసనసభ్యులు కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌కు ఆదివారం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవనంలో ఆజాద్‌ను సుమారు పదిహేను, ఇరవై మంది తెలంగాణ కాంగ్రెసు నేతలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ అంశం త్వరలో తేల్చకుంటే తాము ప్రజల్లోకి వెళ్లి పరిస్థితి లేదని ఆయనకు తెలియజేశారు. ఉప ఎన్నికలకు ముందే తెలంగాణకు పరిష్కారం చూపించాలని కోరారు. తమకు ఎలాంటి ప్యాకేజీలు వద్దని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువరిస్తే చాలని చెప్పారు. అలాగే తమకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో న్యాయం చేయాలని కోరారు. వారి విజ్ఞప్తులకు ఆజాద్ సానుకూలంగా స్పందించారు. మహబూబ్ నగర్ ఉప ఎన్నికలపై ఆజాద్‌కు వివరించినట్లు సమాచార శాఖ మంత్రి డికె అరుణ చెప్పారు.

పలువురు ఎమ్మెల్సీలు కూడా తమకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆజాద్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రాంతాలకతీతంగా కేబినెట్‌లోకి తమను తీసుకోవాలని కోరారు. మంత్రివర్గంలోకి తీసుకునే విషయమై చర్చిస్తామని, అయితే ఎమ్మెల్సీల సేవలు మాత్రం వినియోగించుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాగా అంతకుముందు ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీలో ఎమ్మెల్సీలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గం సహా అన్నింటా తమ ప్రధాన్యం పెంచాలని తాము ఆజాద్‌ను కోరతామని చెప్పారు. నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడం వల్ల కార్యకర్తల్లో తీవ్ర నిరాశ ఉందన్నారు.

English summary
Telangana Congress leaders appealed central minister Ghulam Nabi Azad that to solve Telangana soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X