విజయ సాయి రెడ్డికి చుక్కెదురు, ల్యాప్‌టాప్‌నకు నో

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై కోర్టులో సోమవారం వాదనలు పూర్తయ్యాయి. తన నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్ తనకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని పెట్టుకున్న పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. కోనేరు ప్రసాద్ వైద్యపరమైన రికార్డులు పాతవని సిబిఐ వాదించింది. కోనేరు ప్రసాద్‌కు హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ల్)లో చికిత్స చేయిస్తే సరిపోతుందని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications