దామోదర ఫైట్: సొంత గ్రూపునకు సమ్మేళనాలు

వచ్చే నెల 19న లాల్‌బహదూర్ స్టేడియంలో దాదాపు లక్ష మంది దళితులతో ఈ అంతర్జాతీయ సమ్మేళనాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ఎవరెవరిని ఆహ్వానించాలన్న విషయమై ఇంకా నిర్ధారణకు రాలేదు. లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేలను ఆహ్వానించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలను ఆహ్వానించడంపైనా ఆలోచన చేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఆత్మ గౌరవ నినాదంతో దళితులందరినీ ఒక్కటి చేయడమే అసలు లక్ష్యమని ఆయన వివరిస్తున్నారు. ఇదే క్రమంలో కోస్తా ప్రాంతం లోనూ ఈ ఏడాది మార్చి మూడో వారంలో మరో దళిత సమ్మేళనాన్ని నిర్వహించాలన్న ఉద్దేశంతో దామోదర రాజనర్సింహ ఉన్నారు. దీనిని రాజమండ్రి లేదా గుంటూరులో నిర్వహించేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా దళిత సమ్మేళనాలను నిర్వహించడం ద్వారా ఆ వర్గాన్ని ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications