జూ ఎన్టీఆర్ దూరం కాలేదు, బాలయ్య రావొచ్చు: రమణ

ప్రస్తుతం సీమాంధ్రలో పర్యటిస్తున్న బాలకృష్ణను తాము తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఈ ప్రాంతంలో ఎప్పుడైనా పర్యటించవచ్చునని చెప్పారు. బాలయ్య రాకతో పార్టీలో, ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విధానాల కోసం బాలయ్య ఆరంగేట్రం చేశారన్నారు. అన్నగారి వారసుడిగా రాష్ట్ర ప్రజలు ఆయనను అభిమానిస్తున్నారన్నారు. బాలయ్య ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. ఇంతటి వాగ్ధాటి గల బాలయ్య రాక టిడిపికి లబ్ధి చేకూరుస్తుందన్నారు.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం తాము సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తామని చెప్పారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సరికాదన్నారు. కాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం భేటీ అయింది. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం చేపట్టనున్న పాదయాత్రపై వారు చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications