చిరంజీవి దారిలో జగన్, ఎయిడ్స్‌తో చనిపోయినా:బైరెడ్డి

కానీ, జగన్ టిడిపిపై నిందలు మోపుతున్నారని, చిరంజీవిలా కాంగ్రెస్‌లో కలిసిపోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. ఇక్కడ ఒకటి రెండు మాటలు విసిరి, ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకొంటారని ధ్వజమెత్తారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయనపై దయ కలిగినట్లుగా ఉందని, జగన్‌పై హైకోర్టుకు లేఖ రాసిన శంకర రావును మంత్రివర్గం నుంచి తొలగించారన్నారు. కాగా, బాలకృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వవచ్చా? అన్న ప్రశ్నకు ఆ పదవిని ఆయన కోరుకోవచ్చు లేదా కార్యకర్తలు కోరుకోవచ్చని, కానీ ఇంతపెద్ద పార్టీని నడిపించగల అనుభవం అధినేత చంద్రబాబు నాయుడుకు ఉందన్నారు. ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరని, చంద్రబాబు ప్రధాని అయితే ఇక్కడ ఏదైనా జరగవచ్చునని అన్నారు. బాలకృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని నేను అన్నట్లు సాక్షిలో స్ర్కోలింగ్ వచ్చిందని, అది అబద్దాల ఛానల్ అని రుజువైందన్నారు. ఆ పత్రిక, ఛానల్ చెప్పేది ఎంత నిజమో వాళ్లే రుజువు చేశారన్నారు.












Click it and Unblock the Notifications