వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధ్వంసంపై ధర్నా: జగన్ పార్టీ నేత జూపూడి, గద్దర్ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
హైదరాబాద్: అమలాపురంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసంపై దళిత సంఘాలు మంగళవారం ట్యాంక్ బండ్ వద్ద ఆందోళన నిర్వహించాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు, ప్రజా గాయకుడు గద్దర్, శాసనమండలి సభ్యుడు చుక్కా రామయ్య ఆందోళనలో పాల్గొన్నారు. వారు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు జూపల్లి, చుక్కా రామయ్య, గద్దర్‌లను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడారు. కాంగ్రెసు పార్టీలోని విభేదాలకు అంబేడ్కర్‌ను బలి చేయవద్దని అన్నారు. బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వెంకట స్వామి(కాకా) ఈ ఘటనపై మండిపడ్డారు. తాను అంబేడ్కర్ ఉన్నప్పుడు ఆయన వెంట నడిచే వాడినన్నారు. ఇప్పుడు ఆయన విగ్రహాల ధ్వంసం చూస్తుంటే తనకు దుఖం వస్తుందన్నారు. విధ్వంసంపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెసు తీరు ఓ సామాజిక వర్గాన్ని దూరం చేసుకునే విధంగా ఉందన్నారు. అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమని పెద్దపల్లి ఎంపి వివేక్ అన్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి దళిత వ్యతిరేకిగా తయారయ్యారన్నారు. సమన్వయ కమిటీలో దళితులకు చోటు లేక పోవడం సరికాదన్నారు. మంత్రి శంకర రావును తొలగించడం దళిత వ్యతిరేక విధానంలో భాగమేనన్నారు.

English summary
YSR Congress Party leader Jupudi Prabhakar Rao and Gaddar arrested at tankbund today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X