జగన్‌కు షాక్: పిఏ సునీల్ అరెస్టు, సిబిఐ ఆఫీస్‌కు భార్య

ఇప్పటికే జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి అరెస్టు జరిగినందున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయ సాయి అరెస్టు సైలెంట్‌గానే జరగడం గమనార్హం. కాగా సునీల్ రెడ్డిని గత రెండు రోజులుగా సిబిఐ అధికారులు దిల్ కుషా అతిథి గృహంలో ప్రశ్నిస్తున్నారు. ఆయన నుండి పలు విషయాలు సిబిఐ సేకరించినట్లుగా తెలుస్తోంది. పెట్టుబడులు, ఇతరత్రా అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. జగన్ కంపెనీలకు చెందిన చాలా ఆర్థిక లావాదేవీలు సునీల్ రెడ్డికి తెలిసే అవకాశముంది. గతంలోనూ సునీల్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించింది. సునీల్ రెడ్డి జగన్ భార్య భారతి తరఫు బంధువు.
సునీల్ రెడ్డి భార్య కృష్ణ తేజ మంగళవారం ఉదయం సిబిఐ కార్యాలయానికి వచ్చారు. తమకు ఎలాంటి సమాచారం అందించకుండా సిబిఐ సునీల్ రెడ్డిని తీసుకు వచ్చిందని, సునీల్ అరెస్టును వారు ఇంకా ధృవీకరించలేదని ఆమె చెప్పారు. సమాచారం ఇవ్వకుండా తీసుకు వచ్చినందు వల్లే భయంతో తాను వచ్చానని చెప్పారు. తన భర్తను ఇంటికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. కాగా సిబిఐ సునీల్ రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో ల్యాప్‌టాప్‌ను, కీలక పత్రాలను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సునీల్ రెడ్డిని అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు మంగళవారం సాయంత్రం ఆయన భార్య తేజారెడ్డికి చెప్పారు. విల్లాలను అధిక ధరలకు విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును వైయస్ రాజశేఖర రెడ్డికి, వైయస్ జగన్‌కు అందించడంలో లేదా జగన్ సంస్థల్లోకి మళ్లించడంలో సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని భావిస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద సిబిఐ ఆయనపై కేసులు నమోదు చేసింది.












Click it and Unblock the Notifications