కార్యకర్త చేతిలో చిరు, బాలకృష్ణలను ఓడిస్తాం: అంబటి

జగన్‌ను ఏదో కేసులో ఇరికించాలని కిరణ్ ప్రభుత్వం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, సిబిఐ ప్రయత్నిస్తున్నాయని మరో అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హైదరాబాద్‌లో విమర్శించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ భూముల విషయంలో కోనేరు ప్రసాద్‌తో అసలు కథ నడిపించింది బాబే అని ఆరోపించారు. ఎమ్మార్ సంస్థకు తక్కువ ధరకు భూములు ఇచ్చిన బాబును విచారించకుండా ఆ వ్యవహారంతో సంబంధం లేని జగన్‌ను ఎందుకు విచారిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. జగన్‌ను మొదట ఓఎంసిలో ఇరికించాలని చూశారని, ఆ తర్వాత ఎమ్మార్‌లో ప్రయత్నించారని, అలా సాధ్యం కాకపోవడంతో ఆయన సన్నిహితులను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సునీల్ రెడ్డిని ఏ కేసులో విచారిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు.












Click it and Unblock the Notifications