లక్ష్మినారాయణపై దుమ్మెత్తిపోసిన జగన్ పార్టీ నేతలు

CBI JD Lakshmi Narayana
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసును విచారిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్ర రావు దుమ్మెత్తిపోశారు. వైయస్ జగన్‌ను ఇబ్బంది పెడుతున్న లక్ష్మినారాయణకు మంత్రి పదవి ఇస్తారేమోనని వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు సిబిఐ డైరెక్టర్‌గా పనిచేసిన విజయరామారావుకు మంత్రి పదవి దక్కిందని వారు గుర్తు చేశారు. పత్రికల పొగడ్తలకు లక్ష్మినారాయణ మురిసిపోతున్నారని వారు వ్యాఖ్యానించారు.

లక్ష్మినారాయణ నిజాయితీపరుడు కారని వారు అభిప్రాయపడ్డారు. కాంగ్రెసుకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా లక్ష్మినారాయణ వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. నిజమైన దోషులను లక్ష్మినారాయణ పట్టించుకోవడం లేదని, అమాయకులను వేధిస్తున్నాడని వారన్నారు. జగన్ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తే రాష్ట్ర ప్రజలు లక్ష్మీనారాయణను క్షమించబోరని వారు హెచ్చరించారు. సిబిఐ వైయస్ జగన్ కుటుంబాన్ని వేధిస్తోందని వారు ఆరోపించారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో మొదటి దోషి చంద్రబాబేనని వారన్నారు. చంద్రబాబును వదిలేసి వైయస్ జగన్ కుటుంబ సభ్యులను సిబిఐ వేధిస్తోందని వారన్నారు. సిబిఐ చంద్రబాబు బ్యూరో ఇన్వెస్టిగేషన్‌గా మారిపోయిందని వారు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+