తెలంగాణ పేరుతో కెసిఆర్, జగన్ మోసం: దేవేందర్

తన పార్టీ తెలంగాణకు అనుకూలమేనని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదిస్తే తాము ఆమోదింపజేసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి జీవగడ్డగా మారిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు ఆరేళ్లు గడిచినా మోక్షం లేదని ఆయన అన్నారు. అక్రమాల్లో కూరుకుపోయిన కాంగ్రెసు పార్టీని బొంద పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెసు పార్టీకి రాష్ట్రాన్ని పాలించే ఆర్హత లేదని ఆయన అన్నారు. భ్రష్టు పట్టిన కాంగ్రెసు పార్టీకి చరమగీతం పాడాలని ఆయన కోరారు. అందుకు పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన చైతన్యయాత్రలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో శాసనసభ్యుడు పి. మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications