చిరంజీవి ఫ్యాన్స్‌కు ఓట్లే ఉంటే మేం ఓడేవాళ్లమే: కిరణ్

Chiranjeevi-Kiran Kumar Reddy
చిత్తూరు: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అభిమానులకు అందరికీ ఓటు హక్కు ఉంటే కాంగ్రెసు పార్టీ ఓడిపోయి ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చి ఆయనే ముఖ్యమంత్రి అయ్యే వారని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం చమత్కరించారు. జాతీయ గీతం జనగణమన రచయిత రవీంద్రనాథ్ టాగూర్ వందేళ్ల జయంతి సందర్భంగా జాతీయ గీతానికి స్వరకల్పన జరిగిన మదనపల్లి బిటి కళాశాలలో ఠాగోర్ విగ్రహాన్ని సిఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిరంజీవి అభిమానులకు ఓటు హక్కు ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే వారన్నారు. రాయలసీమలో మొదటి కళాశాల అనిబీసెంట్ కళాశాల అన్నారు. బంగ్లాదేశ్ జాతీయ గీతం రాసింది కూడా ఠాగోరే అని ఆయన అన్నారు. ఈ కళాశాల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఠాగోర్ ఆడిటోరియం నిర్మాణానికి రూ.రెండు కోట్లు, ప్రహారీ గోడ నిర్మాణానికి మరో రెండు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

అంతకుముందు చిరంజీవి మాట్లాడారు. మదనపల్లి బిటి కళాశాల జాతీయ గీతం స్వరకల్పనకు వేదికయ్యే అదృష్టాన్ని నోచుకుందన్నారు. విశ్వకవి కోరుకున్న భారత్ కోసం మనమంతా కృషి చేయాలన్నారు. నా అభిమానులు నాతోనే ఉన్నారని అన్నారు. రవీంద్రనాథ్ టాగూర్ పేరులోని పేరుతో తాను సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ ఉత్సవాలలో పదివేల మంది విద్యార్థులు జనగణమనను ఇరవై సార్లు పాడారు. బిజెపి నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాంతం, భాష, తదితర కారణాలతో ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+