ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదు: జగన్

YS Jaganmohan Reddy
గుంటూరు: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనలో తాను వెనక్కి తగ్దేది లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని జనం నుంచి దూరం చేయాలనే ఒకే ఒక్క ఆలోచనతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా కుట్రలు పన్నాయని ఆయన అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైయస్సార్ ఆశయ సాధన కోసం తన పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లాలో ఆయన తన ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్నారు.

గుంటూరు పాత అంబాపురంలో స్థానిక రైస్‌మిల్ సెంటర్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. తనపై ఆదరణ చూపుతున్న ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆదరణ ఏమాత్రం తగ్గదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి తనను, తన కుటుంబాన్ని వేరు చేయాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+