తెలంగాణ టూర్‌కు అనుమతి అవసరం లేదు: పొంగులేటి

Ponguleti Sudhakar Reddy
హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పర్యటించేందుకు ఎవరి అనుమతులు అవసరం లేదని కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యుడు, ఏఐసిసి మెంబర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి శుక్రవారం అన్నారు. ప్రధాని తెలంగాణలో పర్యటించే ముందు తెలంగాణపై వైఖరి చెప్పాలన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్‌ల ప్రశ్నకు ఆయన స్పందించారు. ప్రధాని పర్యటనకు ఎవరి అనుమతులు అవసరం లేదన్నారు. కిషన్ రెడ్డి, కోదండరాంలు వారి స్థాయికి మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణపై సానుకూల నిర్ణయమే వస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మార్ అక్రమాల కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్ర పైనా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి కంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణకు నార్కో టెస్టులు జరపాలన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైనా ఆయన విరుచుకు పడ్డారు. జెడికి నార్కో టెస్టులు జరపాలని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. సిబిఐ గౌరవాన్ని దెబ్బతీసేందుకే జగన్ వర్గీయులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+