దాడుల వెనక నేతల హస్తం: రీజెన్సీ చైర్మన్ నాయుడు

దాడుల వల్ల 600 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని, బూడిద కుప్పలు మాత్రమే మిగిలాయని ఆయన అన్నారు. కొందరు గుండాలు దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన మేనకోడలి భర్తను దారుణంగా చంపారని ఆయన ఆరోపించారు. తాను కార్మికులను బాగా చూసుకున్నానని ఆయన చెప్పారు. 1200 మంది కార్మికుల భవిష్యత్తు, 2500 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆవేదిన వ్యక్తం చేశారు. రీజెన్సీ సిరామిక్స్ వద్ద 24 గంటల పాటు గస్తీ ఏర్పాటు చేసినట్లు డిఐజి శుక్లా చెప్పారు. నాలుగు బృందాలతో ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications