చేతులు కలిపిన సిఎం కిరణ్, డిప్యూటీ సిఎం దామోదర

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏని 5.99 శాతం పెంచడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వ్యాట్ పెంపు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. చిత్తూరు జిల్లాలో డిఆర్‌డిఏకు 11 ఎకరాలు, అనంతపురం జిల్లాలో బిడిఎల్ కంపెనీకి 44 ఎకరాలు, నెల్లూరులో శిల్పారామం ఏర్పాటుకు 7 ఎకరాలు కేటాయింఆరు. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంపై కూడా సమావేశంలో చర్చించారు. శాసనసభ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని స్థాపించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో శిల్పారామం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఈ స్థితిలో వ్యాట్‌పై నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ నర్సింహన్‌ను రాజభవన్‌లో కలిశారు. గవర్నర్‌గా మరో ఏడాది పాటు నరసింహన్ పదవీకాలాన్ని పొడగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గవర్నర్‌గా వచ్చిన నరసింహన్ పదవీకాలాన్ని పొడగించడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications