వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు రాకుంటే పరువు పోతుంది!: ప్రధానికి బొత్స విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa invites PM again
న్యూఢిల్లీ: రాష్ట్రానికి మీరు రాకపోతే కాంగ్రెసు ప్రభుత్వం పరువు పోతుందని, అందుకోసం మీ పర్యటన రద్దును సమీక్షించుకోవాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అర్థించినట్లుగా తెలుస్తోంది. రాజీవ్ యువకిరణాల పథకం లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రధాని ఫిబ్రవరి నాలుగున హైదరాబాద్ రావాల్సి ఉండగా ఆ పర్యటన రద్దయింది. దీంతో బొత్స ఆయనను రావాల్సిందిగా కోరినట్లు సమాచారం. బొత్స తన సతీమణి, విజయనగరం ఎంపి ఝాన్సీతో కలిసి సోమవారం సాయంత్రం ప్రధానిని కలిశారు. అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో రాజీవ్ యువకిరణాలు సహా పలు రాజకీయ అంశాలపై ప్రధానితో బొత్స చర్చించినట్లు తెలుస్తోంది. రాజీవ్ యువకిరణాలు గురించి ప్రధానికి బొత్స వివరణ ఇచ్చారని సమాచారం. రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంకేతాలిచ్చినట్లవుతుందని, కాబట్టి పర్యటన రద్దుపై పునఃసమీక్షించుకోవాలని మన్మోహన్‌ను కోరినట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించిన వివరాలతో కూడిన రెండు ఫైళ్లను కూడా ప్రధానికి బొత్స సమర్పించినట్లు తెలుస్తోంది.

అలాగే, మరిన్ని రాజకీయాంశాలపై కూడా ప్రధానితో పిసిసి చీఫ్ చర్చించినట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో వరి ధాన్యం మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 చొప్పున పెంచాలని ప్రధానిని బొత్స కోరారు. దేశవ్యాప్తంగా పంటలకు కేంద్రం నిర్ణయించే కనీస మద్దతు ధరను ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా నిర్ధారించాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడి ఖర్చులు, కూలీ రేట్లు పెరిగినందున వరి ధాన్యానికి అదనంగా రూ.200 మద్దతు ధర ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. క్వింటాలుకు రూ.1300 మద్దతు ధర లభిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల పథకాలు రెండింటికీ జాతీయ హోదా కల్పించాలని కోరారు. పట్టణాలు, నగరాల్లో ప్రజా రవాణాను మెరుగు పర్చేందుకు జేఎన్ఎన్‌యూఆర్ఎం పథకం కింద కేంద్రం నిధులు ఇస్తోందని, ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాలకు సైతం కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్టీసికి కేంద్రం సాయం చేయాలని అడిగారు. గ్రామీణ ప్రాంతాల మధ్య రోడ్డు సదుపాయాన్ని మెరుగుపర్చేందుకు అధికంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుపై వ్యతిరేకత వ్యక్తం కావటానికి ప్రధాన కారణం పునరావాస ప్యాకేజీ ఆకర్షణీయంగా లేకపోవటమేనని ప్రధానికి బొత్స తెలిపారు.

English summary
PCC chief Botsa Satyanarayana invited PC Manmohan Singh again to Rajeev Yuvakiranalu inauguration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X