వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు మోజు పడ్డారని ఇచ్చేస్తున్నారు: దేవినేని ఉమ

By Pratap
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswar Rao
హైదరాబాద్: చిరంజీవి మోజు పడ్డారని చెప్పి ఆయన వర్గానికిచెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు కంపెనీ పేరుమీద విజయవాడలోని భవానీ ద్వీపాన్ని ఆయనకు కట్టబెట్టే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు బహుమానంగా ఈ ద్వీపాన్ని ఇస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. "భవానీ ద్వీపంలో 1340 ఎకరాల భూమి ఉంది. టీడీపీ హయాంలో ఇందులో 24 కాటేజీలు, కాన్ఫరెన్సు హాలు, చెట్లపైన కాటేజీలు, బోట్లు వంటి అనేక సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం ఏడాదికి దీని టర్నోవర్ రూ. రెం డు కోట్లు కాగా.. అందులో రాష్ట్ర పర్యాటక సంస్థకు రూ.ఏభై లక్ష ల ఆదాయం వస్తోంది. ఇప్పటికే గణనీయంగా సౌకర్యాల అభివృద్ధి జరిగి మంచి ఆదాయం వస్తున్న దీనిని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఆయన అన్నారు.

రూ.వందల కోట్ల విలువైన ఈ ద్వీపాన్ని కేవలం రూ.60 కోట్లకు ఈ కంపెనీకి క ట్టబెడుతున్నారని, ప్రస్తుతం 33 ఏళ్లకు లీజుకు ఇచ్చి తర్వాత దాని ని మరో ఇరవై ఏళ్లకు పొడిగించే అవకాశం కూడా కల్పించారని ఆయన అన్నారు. ప్రస్తుతం రూ.వంద టిక్కెట్టుతో సామాన్యులు కూడా ఇందులోకి వెళ్లి సేదదీరే అవకాశం ఉందని, బడా బాబులు రంగంలోకి దిగితే ఆ టిక్కెట్టు ధరను ఆకాశానికి తీసుకెళ్లి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

ఈ కేటాయింపుపై గతంలో విమర్శలు చెలరేగినప్పుడు ఎవరికీ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం లీక్ ఇచ్చిందని, కాని ఇటీవలి పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్లో ఈ ద్వీపానికి కూడా ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నట్లు చూపారని, దొడ్డిదారిన దీన్ని ఖరారు చేసే వ్యవహారం నడుస్తోందని అన్నారు. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఈ ద్వీపం చూశారని, తమ సినిమా షూటింగులకు ఇది చా లా బాగుంటుందని అల్లు అరవింద్ అన్నారని ఉమామహేశ్వర రావు చెప్పారు. అధికారులు తొందరపడి ఈ వ్యవహారాన్ని ఆమోదిస్తే శ్రీలక్ష్మి, ఆచార్య మాదిరిగా జైల్లో కూర్చోవలసి వస్తుందని హెచ్చరించారు.

English summary
TDP MLA Devineni Umamaheswar Rao alleged that Government is giving Bhavani island to ganta Srinivas Rao in behest of Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X