చంద్రమతికి జీవం పోసిన రంగస్థల నటి సావిత్రి మృతి

సురభి కళాకారిణిగా మొదలై డీవీ సుబ్బారావు, పొన్నాల రామసుబ్బారెడ్డి వంటి రంగస్థల హేమాహేమీలతో నటించి మెప్పించారు. పద్య ఉచ్చారణ, పాత్ర పోషణ, సంగీతానికి తగిన స్వరగమనంతో మూడు దశాబ్దాల పాటు తెలుగు పద్య నాటకాన్ని రక్తి కట్టించారు. సత్యహరిశ్చంద్ర అంటే డీవీ సుబ్బారావు అన్నట్టే, చంద్రమతి వేషం గూడూరు సావిత్రే వేయాలనేవారు. తన జీవితకాలంలో 13 వేల ప్రదర్శనలు ఇవ్వగా, అందులో చంద్రమతి పాత్రనే ఎక్కువగా పోషించారు. 2011 సంవత్సరానికి గాను హంస అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. ఇప్పటిదాకా మూడు నాటక నందులు అందుకున్నారు. తొలి దశలో కొన్ని సినిమాల్లోనూ సావిత్రి నటించారు.












Click it and Unblock the Notifications