గాలి ఇంకా జైలు పక్షే, బెయిల్ పిటిషన్ తిరస్కరణ

అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో సిబిఐ అధికారులు మరోసారి ఈ నెల 29వ తేదీ ఆదివారం సోదాలు నిర్వహించారు. మళ్లీ గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులపై సిబిఐ అధికారులు మరోసారి దృష్టి పెట్టారు. గాలి జనార్దన్ రెడ్డి హెలికాప్టర్‌ను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని కోర్టు అధికారులకు అప్పగించారు. బళ్లారిలోని నివాసంలో ఈ సోదాలు జరిగాయి.
సిబిఐ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. గతంలో స్వాధీనం చేసుకున్న నగదు, నగలు తనిఖీలను చేపట్టినట్లు సమాచారం. గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో మరిన్ని విలువైన వస్తువులు ఉండవచ్చుననే అనుమానంతో సిబిఐ అధికారులు సోదాలు చేపట్టారు. గాలి జనార్దన్ రెడ్డి నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను తమతో ఉన్న కోర్టు అధికారులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications