జగన్ తొలి సంతకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత కామెంట్

Jupudi Prabhakar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలి సంతకాలపై ఆ పార్టీ నేత, శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర రావు బుధవారం ఓ టీవి ఛానల్ కార్యక్రమంలో స్పందించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పలు ఫైళ్లపై తొలి సంతకం చేస్తానని జగన్ చెప్పడం వారిలో నమ్మకం కలిగించడానికేనని అన్నారు. ఒకేరోజు అన్ని సంతకాలు పెడతారని అర్థం కాదని ఆయా సమస్యలపై అందుకు సంబంధించిన వారిలో గట్టి నమ్మకం కలిగించడానికన్నారు. కాగా ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి సమస్యలపై స్పందిస్తూ పలు ఫైళ్లపై తాను మొదటి రోజే సంతకం చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. గతంలో కాకరాపల్లి ఘటన బాధితులను పరామర్శించిన జగన్ కాకరాపల్లి రద్దు ఫైల్ పైన తొలి రోజు సంతకం చేస్తానని చెప్పారు. ఇటీవల వ్యాట్ ఆందోళనలో పాల్గొన్నప్పుడు కూడా వ్యాట్ రద్దు పైన తొలి రోజు సంతకం చేస్తానని చెప్పారు. ఆ తర్వాత మంగళవారం మహాత్మా గాంధీ హాస్పిటల్‌లో జూడాలకు మద్దతు పలికిన జగన్, డాక్టర్ల సమస్యలు ఒక్క కలం పోటుతో పరిష్కరించ వచ్చునని, తాను అధికారంలోకి వస్తే తొలిరోజే జూడాల డిమాండ్ల ఫైల్ పైన సంతకం చేస్తానని చెప్పారు. దీంతో జగన్ తొలి రోజు సంతకం చర్చనీయాంశమైంది.

కాగా సమాచారం కమిషనర్లను అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై నియమించుకున్నాయని జూపూడి ఆరోపించారు. కమిషనర్ల నియామాకాలలో పారదర్శకత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచార హక్కు కమిషన్ పైన ఉన్న ప్రేమ దళిత, గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ పైన లేదని అంతకుముందు రోజు విమర్శించారు. హైకోర్టులో ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ కారణంగా ముఖ్యమంత్రి కిరణ్ ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ సమావేశమై సమాచార హక్కు చట్టం కమిషనర్లను నియమించిందన్నారు. సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడులకు ఎస్సీ, ఎస్టీ, కార్పోరేషన్లకు పాలక వర్గాలను నియమించాలన్న విషయం గుర్తుకు రాకపోవడం విచారకరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+