అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ, మరోచోట ధ్వంసం

తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం లక్ష్మీపోలవరం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఇటీవల రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసం వరుసగా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దళిత సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. నందిగామలో బంద్ పాటిస్తున్నారు.












Click it and Unblock the Notifications