ఒళ్లు దగ్గర పెట్టుకుంటాం: జీయర్ వ్యాఖ్యలపై కనుమూరి

ఉదయం విష్ణు సహస్ర నామ స్త్రోత్ర పారాయణ మహాయజ్ఞం కార్యక్రమంలో కనుమూరి కూడా పాల్గొన్నారు. ఆయన సమక్షంలోనే స్వామి వారు టిటిడిపై విమర్శలు చేశారు. ఆ తర్వాత కనుమూరి స్వామి వారి వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించారు. ఇటీవలి కాలంలో టిటిడిపై చినజీయర్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మహాయజ్ఞం తర్వాత చినజీయర్ స్వామి తిరుపతి నుండి తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. తిరుమల పాదయాత్ర కాపాడాలని ఆయన ఈ పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి పరిరక్షణ సమితి నేతలు స్వామీజి తీరుపై మండిపడ్డారు. ఈ విషయంలో ఆయనకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications