వారిని తెలంగాణలోకి అనుమతించవద్దు: కోదండరామ్

ప్రచారం, నిర్మాణం, ఆందోళనలే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ తర్వాత ప్రారంభమయ్యే ఉద్యమ ఉధృతి గురించి హైదరాబాదులో పెద్ద యెత్తున చాటి చెప్పాలని ఆయన అన్నారు. సికింద్రాబాద్ జెఎసి నాయకులు లాలాపేటలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ కోసం పోరుయాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications