వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ సహోద్యోగిపై వేధింపులకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Karnataka Map
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని ఓ బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నేర పరిశోధన విభాగం (సిఐడి) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తన లేడీ సహోగ్యోగి అశ్లీల ఛాయాచిత్రాలను అప్‌లోడ్ చేసిందుకు గాను పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న బెంగళూర్‌లోనే టి. సతీష్ అనే ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేసినట్లు సిఐడి అధికారులు చెప్పారు. బాధితురాలు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. గతంలో ఆమె సతీష్ పనిచేస్తున్న కార్యాలయంలోనే పనిచేసేది. తన సాన్నిహిత్యాన్ని ఆసరా చేసుకుని సతీష్ తనవి కొన్ని ఫొటోలు తేశాడని ఆమె చెప్పింది.

కొన్నాళ్లకు ఆమె సతీష్‌కు దూరమైంది. దాంతో కక్ష పెంచుకున్న అతను ఆమె ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా బాధితురాలి ఇ -మెయిల్ ఐడిని హ్యాక్ చేసి ఆమె మిత్రులకు కూడా వాటిని పంపుతూ వచ్చాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెలన్నరగా తెంపు లేకుండా ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ వస్తున్నాడు. సమాచార సాంకేతిక చట్టం కింద సతీష్‌ను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు.

English summary
A software engineer of a multi-national company ( MNC) in Bangalore was arrested on Friday by Crime Investigation Department (CID) officials for allegedly uploading his ex-colleague's obscene photographs, which he forcibly took, in social networking sites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X