ఐఏఎస్‌లలో నాలుగు రకాలు ఉంటారు: రిటైర్డ్ అధికారి

హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల్లో నాలుగు రకాలు ఉంటారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు ఆదివారం ఓ ఛానల్ డిబెట్ కార్యక్రమంలో అన్నారు. మొదటి రకం అధికారులకు నిజాయితీ, ధైర్యం రెండూ ఉంటాయని అన్నారు. వారు ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడరన్నారు. ఒత్తిళ్లను కూడా లెక్క చేయరన్నారు. అవసరమైతే ట్రాన్స్‌ఫర్ చేయమంటారు, కానీ అవినీతికి మాత్రం పాల్పడరన్నారు. రెండో రకం వారికి నిజాయితీ ఉంటుంది కానీ ధైర్యం ఉండదన్నారు. మూడో రకం వారికి నిజాయితీ ఉంటుంది. కానీ పదవి కోసమే పక్కదారి పడతారన్నారు. ఇలాంటి వారిని కాపాడాల్సిన అవసరం లేదన్నారు. నాలుగో రకం వారు అవినీతి పరులని, వారు రాజకీయ నేతలకు కొమ్ము కాస్తుంటారన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి డిపార్టుమెంటులో జరిగే తప్పుకు మంత్రులు బాధ్యత వహించాలన్నారు. డిపార్టుమెంటులో జరిగే ప్రతి నివేదికను మంత్రులు తెప్పించుకోవాలన్నారు. కొందరు అధికారులు తప్పు చేసినందుకు మేమూ సిగ్గుపడుతున్నామన్నారు.

పరిపాలన నడిపించేంది మంత్రులేనని, ఐఏఎస్ అధికారులు కేవలం డ్రైవర్లేనని మరో ఐఏఎస్ అధికారి అన్నారు. బండి తప్పుదారిలో వెళ్తుంటే దారి చూపించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉందన్నారు. మంత్రులు సంతకాలు ఎలా పెడుతున్నారని అన్నారు. రాజకీయ నేతలను వదిలి ఐఏఎస్‌లను విచారించడాన్నే తాము తప్పు పడుతున్నామన్నారు. సిబిఐ విచారణను ఎవరో ప్రభావితం చేస్తున్నారనే అనుమానాలు మాత్రమే అధికారుల్లో ఉందని, కాని తాము సిబిఐ విచారణను ప్రశ్నించడం కానీ, సిబిఐ జెడిని టార్గెట్ చేయడం కానీ చేయడం లేదన్నారు. మేము ఎటువంటి డిమాండ్లు చేయడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+