వారన్న ఆ పెద్ద చేప జగనే, ఉండవల్లి ఎవరు: యనమల

Yanamala Ramakrishna
హైదరాబాద్: ఐఏఎస్‌లు అంటోన్న ఆ పెద్ద చేప వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డియేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం ఆరోపించారు. పెద్దలను వదిలి చిన్న చేపలను బలి చేయడమేమిటని ఐఏఎస్ అధికారులు అడుగుతున్నారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో భారీ అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలని ఆయన అన్నారు. వారంటున్న పెద్ద చేప జగనే అన్నారు. మంత్రులు, ఐఏఎస్ అధికారుల పోటా పోటీ వివాదం వల్ల రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అవినీతి ఏమాత్రం జరగలేదన్నారు. అధికారులు అందరూ నీతిగా పని చేశారన్నారు.

2004కు ముందు ఏ ఒక్క అధికారి కూడా అక్రమాలలో చిక్కుకోలేదని అన్నారు. అక్రమాలలో మంత్రుల తప్పు లేదని చెప్పేందుకు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరని ఆయన అడిగారు. కేవలం అధికారులనే బాధ్యులను చేసి తప్పించుకోవాలని చూడటం సరికాదన్నారు. అవినీతిలో కేబినెట్‌కు ఎంత బాధ్యత ఉంటుందో ఐఏఎస్‌లకూ అంతే బాధ్యత ఉందన్నారు. ముప్పై ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున అధికారులు అరెస్టు కావడం ఇదే మొదటిసారి అన్నారు. ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి పెద్ద చేపలను పట్టుకోమని కోరడమంటే వారు అవినీతి ఒప్పుకున్నట్లేనన్నారు. రాజకీయ నేతలపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+