వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఒకలా ఇక్కడ మరోలా:సిబిఐపై అంబటి రాంబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
గుంటూరు: కేంద్రం ఆదేశాలతోనే సిబిఐ ఢిల్లీలో ఒక విధంగా, రాష్ట్రంలో మరో విధంగా విచారణ సాగిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శనివారం విమర్శించారు. 2జి స్పెక్ట్రంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందంటూ సంబంధిత మంత్రి ఎ.రాజాను అరెస్టు చేసిన సిబిఐ, రాష్ట్రంలో అదే రీతిలో ఎందుకు వ్యవహరించడం లేదన్నారు. రాజాను ముద్దాయిని చేసి జైలులో పెట్టినప్పుడు రాష్ట్రంలో పరిశ్రమల శాఖ మంత్రిని, గనుల శాఖ మంత్రిని సిబిఐ ఎందుకు విచారించి అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ ఒక్క తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని విచారిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల అరెస్టులకు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారే బాధ్యత వహించాలన్నారు. అక్రమాలు జరిగి ఉంటే అది మంత్రివర్గ ఆమోదంతోనే జరుగుతుందని, కేవలం అధికారులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. శంకర రావు జగన్‌పై కోర్టులో పిటిషన్ వేసినప్పుడు టిడిపి నేతలు ఇంప్లీడ్ పిటిషన్ వేశారని, అధికార ప్రతిపక్షాలు కలిసి పిటిషన్ దాఖలు చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమన్నారు.

రాష్ట్రంలో సిబిఐ తీరు ఏకపక్ష ధోరణిలో సాగుతోందని మరో నేత కొణతాల రామకృష్ణ విశాఖపట్నంలో అన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రిని కలవడం, రాజకీయ క్రీడలో తమను బలిపశువుల్ని చేయొద్దని మొరపెట్టుకోవడం చాలా దారుణమన్నారు. ఎమ్మార్ కుంభకోణానికి టిడిపియే కారణమన్నారు. ఈ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును, మంత్రులను వదిలి కేవలం అధికారులనే బాధ్యులను చేయడం సరికాదన్నారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu questioned about CBI enquiry. He accused that CBI is targetting YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X