వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజం చెబితే బయటపడతారు: ఐఏఎస్‌లకు పాలడుగు

By Srinivas
|
Google Oneindia TeluguNews

paladugu venkata rao
హైదరాబాద్: సిబిఐ పిలిచినప్పుడు వాస్తవాలు వెల్లడిస్తే అసలు దోషులు బయట పడతారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు ఐఏఎస్ అధికారులకు శనివారం సూచించారు. సిబిఐ విచారణలో నిజాలెందుకు బహిర్గతం చేయడం లేదని వారిని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసినప్పుడు పిలిచి ప్రశ్నించకూడదా అని అడిగారు. ఎమ్మార్, గాలి అక్రమ గనుల వ్యవహారాల్లో ఐఏఎస్‌ల అరెస్టును పూర్తిగా ఆయన పూర్తిగా సమర్థించారు. వారి విషయంలో తప్పు చేసిన పిల్లల పట్ల తండ్రికి ఉండే బాధ తనకు కలుగుతోందని వ్యాఖ్యానించారు. తరచూ సిబిఐ పిలుస్తుండటం, కేసులు పెట్టడం వంటి చర్యలతో ఐఏఎస్ అధికారులు పడుతోన్న మనోవ్యధను అర్థం చేసుకుంటున్నామని, అలాగే, వారు తమ ఆవేదనను సిఎం కిరణ్‌ కుమార్ రెడ్డికి వెల్లడించడాన్ని కూడా తప్పుపట్టడం లేదన్నారు. అయితే, సిబిఐ పిలిపించినప్పుడు తమకు తెలిసిన వాస్తవాలను ఐఏఎస్‌లు నిర్భీతితో బయటపెడితే బలి కాకుండా ఉండేవారని అభిప్రాయపడ్డారు.

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు అనేకసార్లు పిలిచి ప్రశ్నించారని, పిలిచిన తొలిసారే, తెర వెనుక ఎవరున్నారో, ఎవరు ఒత్తిడి చేశారో, ఆ వాస్తవాలను వెల్లడించాల్సి ఉండేదని, అలాచేస్తే అసలు దోషులు బయటకు వచ్చేవారన్నారు. గాలి కేసు తుది అంకానికి చేరేదని ఆయన అన్నారు. నాలుగైదుసార్లు పిలిచినా వాస్తవాలను బహిర్గతం చేయనందునే ఒకరి తరువాత మరొకరుగా నిందితుల జాబితాలో చేరుతున్నారని ఆయన అన్నారు. శ్రీలక్ష్మిని ఉద్దేశించి సిపిఐ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

English summary
Congress senior leader Paladugu Venkata Rao suggested IAS officers about cbi probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X