మంత్రివర్గ విస్తరణపై పెరుగుతున్న సీనియర్ల అలకలు

అలాగే, గుంటూరు జిల్లాకు చెందిన గాదె వెంకటరెడ్డి కూడా మంత్రి పదవి దక్కనందుకు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి, గాదె వెంకటరెడ్డి తన అసంతృప్తిని చాలా కాలంగా వ్యక్తం చేస్తున్నారు. తనకు బంధువైన డిఎల్ రవీంద్రా రెడ్డికి మంత్రి పదవి కల్పించినందున తనకు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతుండడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన సి. రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ అయినప్పటికీ మంత్రి పదవి ఇచ్చి సీనియర్ ఎమ్మెల్సీలకు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస సీనియర్ శాసనసభ్యురాలు సత్యవతి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. రాజీనామా చేయడానికి సిద్ధపడిన ఆమెను బుజ్జగించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications