హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముచ్చటగా ముగ్గురు మంత్రులుగా ప్రమాణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Uttam Kumar Reddy-Prasad Kumar-Kondru Murali
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోకి కొత్తగా మరో ముగ్గురు మంత్రులు వచ్చి చేరారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరిని ఇంతకు ముందు మంత్రి వర్గంలోకి తీసుకున్న ఆయన ఇప్పుడు ముగ్గురిని మంత్రులుగా చేర్చుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రంగా రెడ్డి జిల్లాకు చెందిన ప్రసాద్ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రు మురళి మంత్రులుగా సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ వారిచేత ప్రమాణం చేయించారు. ఇంతకు ముందు రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి, జూపల్లి కృష్ణారావు స్థానంలో కొండ్రు మురళికి స్థానం కల్పించారు. బర్తరఫ్ అయిన పి. శంకరరావు స్థానంలో ప్రసాద్ కుమార్‌కు ఆయన మంత్రి వర్గంలో చోటు కల్పించారు.

మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కాంగ్రెసు నేత చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. రఘవీరా రెడ్డి, వట్టి వసంత కుమార్, ఏరాసు ప్రతాప రెడ్డి, గల్లా అరుణ కుమారి, గీతా రెడ్డి తదితర మంత్రులు, శాసనసభ్యులు కూడా వచ్చారు.

సైన్యంలో కెప్టెన్‌గా ఎంత క్రమశిక్షణగా పనిచేశానో మంత్రిగా అంతే క్రమశిక్షణతో పనిచేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటన్నారు. తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వలేదని అంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇప్పుడు ఇస్తే ఎందుకు విమర్శిస్తోందని ఆయన అడిగారు. ఏ శాఖ అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని ఆయన అన్నారు. తనకు మంత్రివర్గంలోకి చోటు కల్పించినందుకు కొండ్రు మురళి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా ప్రమాణం చేయడానికి ముందుకు విప్ పదవికి కొండ్రు మురళి రాజీనామా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వైద్య విద్యను, ప్రసాద్ కుమార్‌కు చేనేత జౌళి శాఖను, కొండ్రు మురళికి ఆర్‌డబ్ల్యుఎస్ శాఖను కేటాయించారు.

కొత్తగా ముగ్గురు చేరడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కోస్తాంధ్రకు చెందినవారు 17 మందికి ప్రాతినిధ్యం లభించింది. కొండ్రు మురళి చేరికతో ఈ సంఖ్య 16 నుంచి 17కు పెరిగింది. తెలంగాణకు కూడా అంతే ప్రాతినిధ్యం ఏర్పడింది. ఇంతకు ముందు 13 మంది మంత్రులు ఉండగా, ఆ సంఖ్య ఇద్దరి చేరికతో 15కు పెరిగింది. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రితో కలిపి 9 మంది ఉన్నారు.

English summary
Uttam Kumar Reddy, Kondru Murali and Prasad Kumar were inducted into CM Kiran kumar Reddy cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X