రామోజీ ఈనాడు డైలీ రాతలకు జగన్ సాక్షి కౌంటర్

ఉపాధితో నిమిత్తం లేని ఎమ్మార్ గోల్ఫ్‌కోర్స్‌కు చంద్రబాబు 535 ఎకరాల భూమి ఇవ్వడం తప్పు కాదా అని ప్రశ్నించింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఐఎంజీ అనే నకిలీ సంస్థకు చంద్రబాబు 850 ఎకరాల భూమిని ధారపోస్తే ఎందుకు ప్రశ్నించలేదని ఈనాడును అడిగింది. ఎల్ అండ్ టీకి హైటెక్ సిటీ ఇచ్చినందుకే టిడిపి ఆఫీసును ఉచితంగా కట్టి ఇవ్వడం క్విడ్ ప్రో కో కాదా అని అడిగింది. సిబిఐ మీద కూడా సాక్షి దినపత్రిక విరుచుకపడింది. సిబిఐ ఎల్లో మీడియాను అనుసరిస్తోందా, ఎల్లో మీడియా రాతలకు సిబిఐ సహకరిస్తోందా అంటూ ప్రశ్నించింది. ఎల్లో మీడియా దురుద్దేశపూర్వకంగా కథనాలను ప్రచురిస్తోందని, వాటి ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆడిపోసుకుంది. చంద్రబాబు ఏయే సంస్థలకు ఎంతెంత భూమిని కేటాయించిందో కూడా సాక్షి దినపత్రిక క్రోడీకరించింది. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో వివిధ సంస్థలకు 17,434 ఎకరాల భూమిని కట్టబెట్టారని సాక్షి దినపత్రిక తేల్చింది.












Click it and Unblock the Notifications