చెంచాగిరి చేయను:కత్తిరింపుపై సిఎంమీద డిఎల్ సీరియస్

ఉప ఎన్నికల్లో తన ప్రమేయం ఉండదన్నారు. ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే బాధ్యత వహించాలన్నారు. కడప జిల్లాలో ఆధిపత్యం చూపాలనుకుంటున్న వారు ఉప ఎన్నికల్లో మూడు సీట్లు గెలిపించి తమ సత్తా చూపాలని అన్నారు. పదవిలో కోత విధించి భారం తగ్గించినందుకు సిఎంకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. తనను కేబినెట్ నుండి తప్పించినా బాధపడనని, సామాన్య కార్యకర్తగా పని చేస్తానని అన్నారు. తనకు ఎవరితో విభేదాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతానని అన్నారు. కాంగ్రెసు వల్లనే తాను ఉన్నత స్థానానికి వచ్చానని అన్నారు.












Click it and Unblock the Notifications