హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ను విమర్శించేవారిపైనే సిఎం వేటు: టిడిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

TDP Logo
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేవారిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దూరం పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. వైయస్ జగన్‌పై కేసు వేసి, మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మోపిదేవి వెంకటరమణల అవినీతిని ప్రశ్నించిన పి. శంకరరావును మంత్రి వర్గం నుంచి తొలగించారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవినీతి గురించి మాట్లాడే మంత్రులను ముఖ్యమంత్రి దూరం పెడుతున్నారని ఆయన అన్నారు. ఆరోగ్య శాఖలో అవినీతిని బయటపెడుతానని చెప్పిన డిఎల్ రవీంద్రా రెడ్డిని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తదితరులు బతిమిలాడుతున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ పట్ల కిరణ్ కుమార్ రెడ్డి మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆయన అన్నారు.

మద్యం సిండికేట్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, లేదంటే ముఖ్యమంత్రికి కూడా వాటా ఉందని భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో వాస్తవాలు బయటపడుతాయని, పెద్ద చేపలు బయటుపడతాయని చెప్పి చిన్న చేప మోపిదేవి వెంకటరమణ పేరు ఇరికిరంచారా అని ఆయన అడిగారు. మోపిదేవి వెంకటరమణ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణలు నిర్ధారణ అయిన మోపిదేవి వెంకటరమణతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరపడం సరి కాదని ఆయన అన్నారు. మోపిదేవి వెంకటరమణతో జరిపిన చర్చల సారాంశాన్ని బయటపెట్టాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి ఎసిబి దాడులను కిరణ్ కుమార్ రెడ్డి వాడుకుంటున్నారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి పదవి పోటీ పడుతున్నారని చెప్పి ఎసిబి దాడులను బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా వాడుతున్నారని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణను ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఎసిబి దాడులు జరిగిన తర్వాతనే 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పచారని, అంతకు ముందు కాంగ్రెసులో ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హులేనని అన్నారని ఆయన అన్నారు. తమ శాసనసభయ్డు వెంకటవీరయ్యకు మద్యం సిండికేట్లకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మోపిదేవి వెంకటరమణ అడ్డంగా దొరికిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. దొరికిపోయిన తర్వాత మోపిదేవి వెంకట రమణ బుకాయిస్తున్నారని ఆయన అన్నారు.

English summary
TDP MLC Babu Rajendra Prasad alleged that CM Kirankumar Reddy is saving corrupt persons and taking action against who are fighting against corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X