కోర్టులో చిరువర్గం మంత్రి రామచంద్రయ్యకు చుక్కెదురు

ప్రభుత్వాధికారిని దూషించారని, విధులకు ఆటంకం కలిగించారని రామచంద్రయ్యతో సహా ఇరవయ్యొక్క మందిపై కేసు నమోదైంది. అప్పటి నుండి దీనిపై విచారణ జరుగుతోంది. ఈ కేసును ఉపసంహరిస్తూ ఈ జనవరి 13వ తేదిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ ఎదుర్కొంటున్న వారందరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని కోర్టు చెప్పింది. ఇటీవల రామచంద్రయ్య హాజరు కావాల్సి ఉన్నప్పటికీ గైర్హాజరయ్యారు. హాజరు కావాల్సిందేని కోర్టు చెప్పింది. దీంతో రామచంద్రయ్య ఈ రోజు కోర్టు ఎదుట హాజరయ్యారు.












Click it and Unblock the Notifications