చంద్రబాబుపై వైయస్ చాలా కమిటీలు వేశారు: జెసి

న్యాయ సలహాలు తీసుకుని అవసరమైతే ఆయా శాఖల మంత్రులను కూడా సీబీఐ విచారించవచ్చునని ఆయన అన్నారు. సీబీఐ కేవలం ఐఏఎస్‌లను టార్గెట్ చేస్తూ విచారణ జరుపుతోందే తప్ప సంబంధిత మంత్రుల గురించి పట్టించుకోలేదన్న ఆరోపణలపై ఈ విధంగా అన్నారు. వైయస్ హయాంలోని భూకేటాయింపులపై సభా సంఘం వేసినంత మాత్రాన టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయనడంలో అర్థం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపైన, కాంగ్రెస్ ప్రభుత్వంపైన మంత్రి డీఎల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. తనను అడిగేకంటే డిఎల్ రవీంద్రా రెడ్డినే అడిగితే సరైన సమాధానం వస్తుందని చతమ్కరించారు. డీఎల్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయన్న దానిపై జేసీ స్పందిస్తూ అలాంటిదేమీ ఉండదని కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications