వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసు: మోహన్ కందాను ప్రశ్నించిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mohan Kanda
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు శుక్రవారం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాను ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తన హయాంలో జారీ అయిన ఉత్తర్వుల గురించి సిబిఐ అధికారులు తనను ప్రశ్నించారని, వాటన్నింటికీ తాను సమాధానం చెప్పానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. కందాను సీబీఐ అధికారులు మూడుగంటలపాటు ప్రశ్నించా రు. 2003 ఆగస్టు 21 నుంచి 2005 సెప్టెంబర్ నెలఖారు వరకు మోహన్‌కందా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయిన తర్వాత జారీ అయిన కొన్ని జీవోలకు సంబంధించి కందా నుంచి సీబీఐ అధికారులు వివరణ తీసుకున్నట్లు తెలిసింది.

శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు సిబిఐ అధికారులు మోహన్ కందాను ప్రశ్నించారు. నాలుగైదు రోజుల తర్వాత తనను రావాలని అడిగారని, అయినా ముందే తాను వచ్చానని మోహన్ కందా చెప్పారు. వైయస్ ప్రభుత్వ హయాంలో ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన సీనియర్ ఐఎఎస్ అధికారులను సిబిఐ ప్రశ్నిస్తోంది. అందులో మోహన్ కందా మూడో వారు. ఇప్పటికే సిబిఐ రమాకాంత్ రెడ్డిని, రఘోత్తమ రావును ప్రశ్నించింది. తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాలంలో జారీ అయిన కొన్ని జీవోలకు సంబంధించి సీబీఐ అధికారులు వివరాలు అడిగారని మోహన్ కందా తెలిపారు. జీవోల జారీ సమయంలో బిజినెస్ రూల్స్ పాటించారా లేదా అనే విషయాలను సీబీఐ తెలుసుకుందని మోహన్ కందా తెలిపారు. వారు కోరిన సమాచారం తెలియజేశానన్నారు. తనకు వీలైన సమయంలోనే సీబీఐ కార్యాలయానికి రావాలని అధికారులు కోరారని కందా చెప్పారు.

కాగా, జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ, సిటీ బ్యాంక్ అధికారులు సీబీఐ ముందు హజరయ్యారు. ఎమ్మార్ కేసుకు సంబంధించి సాక్షిగా ఉన్న జగన్నాథం సీబీఐ ముందు హాజరై కొన్ని వివరాలు అందచేసినట్లు సమాచారం.

English summary
CBI has grilled IAS officer and former chief secretary Mohan Kanda in YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X