హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్ చదువుపై యువతకు బాబు చెప్పరేం?: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తన తనయుడు లోకేష్ కుమార్‌ను స్టాన్‌ఫర్డ్‌లో చదివించడానికి రూ.60 లక్షల సొమ్మును వేరెవరితో కట్టించిన దౌర్భాగ్య పరిస్థితి గురించి యువతకు ఎందుకు చెప్పడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శనివారం ప్రశ్నించారు. చంద్రబాబును నేటి యువత ఏం చూసి ఆదర్శంగా తీసుకోవాలని అడిగారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచినందుకా, తోడల్లుడిని, బావమరిదిని, తమ్ముడిని వాడుకొని వదిలేసినందుకా, ప్రజా ఉద్యమాలు అణిచి వేసినందుకా లేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేయించి యువతకు ఉద్యోగాలు లేకుండా చేసినందుకా దేనిని చూసి నేర్చుకోవాలన్నారు. ప్రతిష్ట కోల్పోతున్న తన పార్టీని కాపాడుకోవటానికి యువతరంగాల పేరుతో బాబు నిర్వహిస్తున్న సభల్లో తాను సిఎంగా ఇవి చేశాను అవి చేశానని చెప్పుకుంటూ ఆయన సొంత డబ్బా కొట్టుకుంటున్నారని, కానీ ఆయన ఘనత గురించి ఎవరూ చెప్పడం లేదన్నారు. ఎవరూ చెప్పనందువల్లే ఆయనకు ఆయనే స్కోత్కర్ష చేసుకుంటున్నారన్నారు.

తొమ్మిదేళ్ల తన పాలన బ్రహ్మాండంగా ఉండేదని, కావాలంటే తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలని బాబు చెబుతున్నారని, మరి ఆయన మంచి పాలన ఇస్తే అదే ప్రజలు ఆయనను ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు. రెండుసార్లు వరుసగా ఎందుకు ఓడించారో చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్స్ వల్ల, తల్లిదండ్రుల కష్టార్చితం వల్లనో చదువుకుంటున్న యువకుల వద్దకు బాబు వెళ్లి తానే ఆదర్శవంతుడినని చెప్పుకోవడం దారుణమన్నారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu questioned TDP chief Chandrababu Naidu about his Lokesh Kumar studies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X