చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈనాడు అనుకూలం సాక్షి వ్యతిరేకం: ఎంపి సాయిప్రతాప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sai Pratap
చిత్తూరు/హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో అధికార కాంగ్రెసు పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా పత్రికల కంటే ఈనాడు బాగా మద్దతిస్తోందని రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ ఆదివారం చిత్తూరు జిల్లాలో అన్నారు. సాక్షి దిన పత్రిక తమకు ఏమాత్రం అనుకూలంగా రాయడం లేదని, వ్యతిరేక కథనాలే ప్రచురితమవుతున్నాయని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలతో ఉప ఎన్నికలు అనివార్యమైతే అక్కడ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి విజయానికి కృషి చేస్తామన్నారు. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని ఓడించడం ఎవరి తరం కాదన్నారు. కాంగ్రెసులో టిక్కెట్ తెచ్చుకోవడానికి అడ్డదారులు ఉండవని, రహదారులు మాత్రమే ఉంటాయని అన్నారు.

మరోవైపు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జగన్ వర్గం ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంపై స్పందించారు. ఆయన ఆదివారం కర్నాటకలో తుమకూరు జిల్లా పావగడలో కమ్మ సంఘం సభ్యులు నిర్మించిన ఉచిత హాస్టల్ భవన ప్రారంభ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీకి, ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన శాసనసభ్యులపై రానున్న మార్చి నెలాఖరులోపు స్పీకర్ అనర్హత వేటు వేస్తారని జోస్యం చెప్పారు.

English summary
MP Sai Pratap said that Eenadu paper is supporting Congress government with compare to other papers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X