టీవీ చానెల్ న్యూస్ రీడర్ ఆత్మహత్య, ఒత్తిడి వల్లే

పోలీసుల కథనం ప్రకారం - శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చాడు. రూమ్మేట్ జీను కుమార్ డిన్నర్‌కు వెళ్లి రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాడు. అతను వచ్చి చూసే సరికి సవ్యసాచి పట్నాయక్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అయితే అప్పటికే అతను మరణించాడు.
సంఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అది ఒరియాలో రాసి ఉంది. పట్నాయక్ తండ్రి ఇటీవల మరణించాడు. దీంతో కుటుంబ భారం అతనిపై పడింది. తమ్ముడు, చెల్లె ఉన్నారు. అతను ఒరిస్సాలోని గంజాం జిల్లాలోని సిద్ధేశ్వర్‌కు చెందినవాడు. పోస్టు మార్టం తర్వాత అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications